2004-11-20

zubhaan-e-mulk vachchEsindi!

[ikkaDa kuDA! ;-) ]
vachchina information taTTukOlEka, processing overload ayyipoyi, bharatIya bhaashallO kaMpyUTar prayOgam ("Indic language computing") pai oka kotta blaag~ modalu peTTAnu. dammu unTE kaasukOnDi.

2004-11-03

అమెరికా ఎన్నికలు.

వెఱ్రి కెర్రి ఘన విజయమా, బుష్షాశురుని ఘోర పరాజయమా?

రేపు పని మీద దృష్టి మళ్ళించడం మరి కాస్త కష్టమే!

Inscript కీబోర్డుతో టైపింగ్ వేగము.

పర్వాలేదు, కానీ qwerty అంత ఫాస్ట్ కాదు.

ఆకలీ, అన్నమూ, కంప్యూటర్ రిపేర్, నిద్దుర.

ఈ మూడు గుణములు లేని ఏమన్నా వుందా?

2004-09-24

కొత్త కంప్యూటరు!

ఇంకేముంది, విచ్చలవీడిగా రెచ్చిపోడమే!

రాబోయే కంప్యూటర్ విభంజనానికి మీరు సిధమేనా?

2004-09-18

వినాయక చవితి శుభాకాంక్షలు!

ఓ బొజ్జ గణపయ్య,
నీ బంటు నేనయ్య,
కుడుములూ, ఉండ్రాళ్ళూ తేలేదు, సారీ; అయినా ఇంటికి వచ్చావు, అదే సంతోషం.

2004-09-16

ఖర్జురపు పండు మాహాత్మం.

వింటే తెలియదు, తింటే తెలుసుతుంది.

గుర్తుంచుకోవాలసిన విషయం ఏమిటంటే, చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి. ఎక్కువ కూరితే, కొర బోయతుంది.

2004-09-15

విండోస్ 2000 వేధింపులు.

క్షుణ్ణంగా చెప్పాలంటే, ఆఫీసు కంప్యూటర్లో విండోస్ 2000 యే వుంది. విండోస్ 2000లో (తెలుగు) యూనీకోడ్ లేదు. తెలుగు యూనీకోడ్ లేకుండా ఇక్కడ తెలుగులో పోస్ట్ చెయ్యడం అసాధ్యం. అందుకే ఈ మౌనం.

కనీసం ఈ శనాదివారాల్లోనైనా నా కొత్త కంప్యూటరు కొంటే....

2004-08-19

తెలుగులో పాడుతున్న ఇతర భాషా "వాగ్గేయకారులు".

అందరినీ నిష్పక్షపాతంగా వధించేయాలి. మన భాషను వాళ్ళు వధించే ముందు.

(కానీ, అదే చెంపా ఇతర భాషా కథా నాయకురాళ్ళను బహుశా వదిలేయచ్చేమో. ముఖ్యంగా, మలయాళీ కథా నాయకురాళ్ళు. )

2004-08-18

కొత్త ఉద్యోగం, కొత్త ఆలోచనలు.

నిజానికి, నాకు తెలుగు కీబోర్డూ, డైరీలు వ్రాసే అలవాటూ, ఏదీ లేదు. అందుకే ఇప్పటి దాకా ఎప్పుడూ update చెయ్యలేదు. కానీ, బద్ధకించడంతో మరి తెలుగు వెలుగు సైబర్ ప్రపంచములో పెరగదు కదా. అందుకే, ఏది ఏమైనా, ఎవరు చదివి చదవకపోయినా, రోజుకు ఒక్కసారి అయినా ఇక్కడ ఏదో ఒక చొళ్ళు ఖబురు రాయాలని నిశ్చయించుకున్నా. నా నిశ్చయానికి, మరి, తిరుగు లేదు.

Anyway, నాకు ఓ కొత్త ఉద్యోగం వచ్చింది. కంపనీ పేరు... పోనీలేండి, పేర్లు ఎందుకు. మీరు ఊహించింది కరెక్టే; ఇది ఒక IT కంపనీ, నేను (ఇక) సాఫ్ట్వేర్ ఇంజినియర్ని. పని ఇప్పటి వరకూ (అంటే గత రెండు రోజుల్లో) పరవాలేదు, జీతం మిగతా చోట్లకంటే మిన్న.

అందకే, ఇప్పటి వరకూ వేశినవి (రెజ్యూమే పంపించడం, ఇంటర్వ్యూ రప్పించుకోవడం) కుప్పిగంతులు. అసలు యజ్ఞము ఇప్పుడు మొదలు.

2004-07-20

నమస్కారం.

దేశ భాషంలందు తెలుగు లెస్స.

అందుకే, మన భాషలో మనమే బ్లాగ్ చేద్దాం.