2004-08-19

తెలుగులో పాడుతున్న ఇతర భాషా "వాగ్గేయకారులు".

అందరినీ నిష్పక్షపాతంగా వధించేయాలి. మన భాషను వాళ్ళు వధించే ముందు.

(కానీ, అదే చెంపా ఇతర భాషా కథా నాయకురాళ్ళను బహుశా వదిలేయచ్చేమో. ముఖ్యంగా, మలయాళీ కథా నాయకురాళ్ళు. )

2004-08-18

కొత్త ఉద్యోగం, కొత్త ఆలోచనలు.

నిజానికి, నాకు తెలుగు కీబోర్డూ, డైరీలు వ్రాసే అలవాటూ, ఏదీ లేదు. అందుకే ఇప్పటి దాకా ఎప్పుడూ update చెయ్యలేదు. కానీ, బద్ధకించడంతో మరి తెలుగు వెలుగు సైబర్ ప్రపంచములో పెరగదు కదా. అందుకే, ఏది ఏమైనా, ఎవరు చదివి చదవకపోయినా, రోజుకు ఒక్కసారి అయినా ఇక్కడ ఏదో ఒక చొళ్ళు ఖబురు రాయాలని నిశ్చయించుకున్నా. నా నిశ్చయానికి, మరి, తిరుగు లేదు.

Anyway, నాకు ఓ కొత్త ఉద్యోగం వచ్చింది. కంపనీ పేరు... పోనీలేండి, పేర్లు ఎందుకు. మీరు ఊహించింది కరెక్టే; ఇది ఒక IT కంపనీ, నేను (ఇక) సాఫ్ట్వేర్ ఇంజినియర్ని. పని ఇప్పటి వరకూ (అంటే గత రెండు రోజుల్లో) పరవాలేదు, జీతం మిగతా చోట్లకంటే మిన్న.

అందకే, ఇప్పటి వరకూ వేశినవి (రెజ్యూమే పంపించడం, ఇంటర్వ్యూ రప్పించుకోవడం) కుప్పిగంతులు. అసలు యజ్ఞము ఇప్పుడు మొదలు.